ప్రజల నుండి వస్తున్న ఒత్తిడి మేరకు బొబ్బిలి మెయిన్ బజార్ లో ఉన్న వైన్ షాపును వేరే ప్రాంతానికి మార్చడం జరిగిందని ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ పి చిన్నం నాయుడు తెలియజేశారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ నూతన వైన్ షాపును అన్ని నిబంధనలను పాటించి తరలించడం జరిగిందన్నారు. ఎక్సైజ్ కండిషన్స్ రూల్ 24 ప్రకారం మార్పు చేశామన్నారు.