రేషన్ పంపిణీలో అవకతవకలు జరిగితే చర్యలు తప్పవు: తహసిల్దార్
పొన్నూరు పట్టణంలోని శ్రీ ఆర్యవైశ్య కళ్యాణ మండపoలో గురువారం పొన్నూరు పట్టణ,రూరల్ పరిధిలోని చౌక ధరల డిపో డీలర్లు, ఎం. డీ. యూ. ఆపరేటర్లతో తహసిల్దార్ మహమ్మద్ జియావుల్ హక్ సమావేశమయ్యారు. ప్రతి నెల1వ తారీఖు నుండి 18వ తారీఖు వరకు నూరు శాతం పంపిణీ చేయాలన్నారు. సరుకుల పంపిణీలో అవకతవకలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ నెల నుండి ప్రభుత్వం జొన్నలు అందిస్తుందని తెలిపారు. రెవిన్యూ సిబ్బంది పాల్గొన్నారు.