నరసరావుపేటలోని ఎన్జీవో హోమ్ నందు ప్రజా సంఘాల నాయకులు సోమవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో పదం రాష్ట్ర నాయకులు వై. వెంకటేశ్వరావు, నల్లపాటి రామారావు, ఏపీ గిరిజన సంఘము రాష్ట్ర ఉపాధ్యక్షులు వి. కోట నాయక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణ, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలో జరుగుతున్న బూటకపు ఎన్ కౌంటర్లు నిలిపివేయాలన్నారు.