గుంటూరు: మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి పెట్టాలి: లక్ష్మణరావు

63பார்த்தது
గుంటూరు నగరంలో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ లక్ష్మణరావు సూచించారు. గుంటూరు నగర సమగ్ర అభివృద్ధిపై శుక్రవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో శుక్రవారం సమావేశం జరిగింది. సమావేశంలో మేయర్ మనోహర్, కమిషనర్ శ్రీనివాసులు, ఎమ్మెల్సీ లు కేఎస్ లక్ష్మణరావు, ఏసురత్నం పాల్గొన్నారు. లక్ష్మణరావు మాట్లాడుతూ తాగునీరు, రహదారులు, ట్రాఫిక్ నియంత్రణ వంటి సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేయాలన్నారు.

தொடர்புடைய செய்தி