గుంటూరు జిల్లా నూతన డిఆర్ఒగా బాధ్యతలు చేపట్టిన ఎన్ఎస్కె ఖాజావలిని ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు శనివారం కలిసి శుభాకాంక్షలు తెలిపారు. క్షేత్రస్థాయి అధికారుల అవగాహన రాహిత్యం వల్ల ఓటు నమోదు కోసం గ్రాడ్యుయేట్ ఓటర్లు ఎదుర్కొంటున్న పలు సమస్యలను డిఆర్ఒ దృష్టికి తెచ్చారు. ఓపెన్ డిగ్రీ, అటెస్టేసన్, సర్టిఫికెట్స్ మొదలైన అంశాలపై స్పష్టమైన ఆదేశాలిచ్చి ఆటంకాలు తొలగించాలని కోరారు.