గుంటూరు: చిట్టీల పేరుతో రూ. కోటి కుచ్చుటోపి పెట్టిన మహిళ

76பார்த்தது
చిట్టీల పేరుతో రూ. కోటి మోసగించారంటూ బాధితులు సోమవారం గుంటూరు పోలీస్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. గుంటూరు నల్లచెరువుకు చెందిన అనసూయ ప్రైవేటు చిట్టీలు నిర్వహిస్తుంది. ఆమె వద్ద అదే ప్రాంతానికి చెందిన చిరు వ్యాపారులు, మహిళలు చిట్టీలు వేశారు. చిట్టి గడువు మూసి మూడు నెలలైనా డబ్బులు ఇవ్వకుండా కుటుంబ సభ్యులతో సహా పరారైనట్లు బాధితులు ఫిర్యాదు చేశారు. సభ్యులకు రూ. కోటి వరకు మోసగించినట్లు ఆరోపించారు.

தொடர்புடைய செய்தி