విజయవాడ వాంబే కాలనీలో బాధితులకు సోమవారం మంత్రి నాదెండ్ల మనోహర్ సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం తరఫున ప్రతి ఒక్కరికి 25 కేజీల బియ్యంతో పాటు, ఐదు సరుకులు అందుతాయని అన్నారు. ఎవరు కూడా నిరాశ పడవద్దని, కూటమి ప్రభుత్వం ప్రజలను ఆదుకుంటుందన్నారు.