ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలో మైలవరం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సర్నాల తిరుపతిరావు బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముందుగా ఆయనకు మండల నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు, గ్రామ ప్రజలు ఘన స్వాగతం పలికారు. అనంతరం గడప గడపకు వెళ్ళి మైలవరం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆయనను మరియు విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి కేశినేని నాని ని ఆశీర్వదించి భారీ మెజార్టీ తో గెలిపించాలని కోరారు.