బంగ్లాదేశ్ లోనీ హిందువులపై దాడులకు వ్యతిరేకంగా జగ్గయ్యపేటలో హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో బుధవారం నిరసన ర్యాలీ ప్రదర్శన జరిగింది. వందల మంది హిందువులు ర్యాలీలో పాల్గొన్నారు. హింసకు వ్యతిరేకంగా ఉండే హిందువులు ధర్మాన్ని రక్షించుకోవడం కోసం హింస చేయడానికి కూడా వెనుకాడరని రామకృష్ణాచార్యులు తెలిపారు. రాజకీయ నాయకులు బంగ్లాదేశ్లో ఇంతటి ఘోర కృత్యాలు హిందువులపై జరుగుతుంటే నోరు మెదపడం లేదన్నారు.