ఖాదిరివారి 217వ గంధ మహోత్సవ ఆహ్వానము

1096பார்த்தது
ఖాదిరివారి 217వ గంధ మహోత్సవ ఆహ్వానము
1975 వ సంవత్సరం నుండి హక్కుదారుడైనా జనాబ్ సయ్యద్ నూరుల్లాఖాన్ సాహెబ్ వారి ఇంటి నుండి హజరత్ వారి గంధము బ్యాండు, ఫకీరు బఠబులు, షేక్ భాషామొహిద్దీన్ ఫైర్వర్స్, ఉదయగిరి వారి బాణాసంచాలతో శివలింగం ఆడి కడప వారి విద్యుత్ దీపాలంకరణతో మరియు పూల చాందినీలతో అతివైభవముగా తేది 27-08-2022 శనివారం తెల్లవారుజామున గంజ 5-00 లకు గంధము దర్గా షరీఫ్ చేరును. చదివింపులు తదుపరి ప్రసాదములు పంచబడును.

కార్యక్రమములు:
తేది 26-08-2022 శుక్రవారం
సాయంత్రం గం. 6-00 లకు చదివింపులు, పూల చాందినీ, మేళతాళములతో దర్గా షరీఫ్ చేరును. సాయంత్రం గం॥ 7-00 లకు స్వామివారి భక్తులచే భక్తులందిరికీ దర్గా కమిటీ ఆధ్వర్యంలో అన్నప్రసాద సహపంక్తి భోజన కార్యక్రమము పెద్ద మసీదు ఆవరణము నందు జరుగును. రాత్రి గం॥ 9-00 లకు మ్యూజికల్ నైట్ జరుగును.
రాత్రి గం॥ 2-30 ని॥లకు నూరుల్లాఖాన్ సాహెబ్ వారి ఇంటి వద్ద నుండి బయలుదేరి తెల్లవారుజామున తేది 27-08-2022 శనివారం ఉదయం గం|| 5-00 లకు దర్గా షరీఫ్ చేరును.
తేది 27-08-2022 శనివారం సాయంత్రం గం. 6-00 లకు అన్నీ చరాగె ఫాతెహా (దీపారాధన) కార్యక్రమము దర్గా షరీఫ్ వద్ద జరుగును.
తేది 27-09-2022 శనివారం రాత్రి గం. 1000 గొప్ప ఖవ్వాలి పాట కచ్చేరి జరుగును.
తేది 28-08-2022 ఆదివారం తహలిల్ ఫాతిహా ఉదయం గం. 7-00 నుండి 8-00ల వరకు ఖసాయర్ ఖ్వాని మరియు ఫకీరు రుబులతో తహలి ఫతెహ జరుగును. కావున హిందూ, ముస్లిం భక్తులందరు ఈ గంధ మహోత్సవములో పాల్గొని హజరత్ వాలి కృపకు పాత్రులగుదురని కోరుచున్నాము.

டேக்ஸ் :