ఎమ్మిగనూరు: హాలహర్విలో గడ్డివాములు దగ్ధం
నందవరం మండలం హాలహర్విలో ఆదివారం చాకలి రాఘప్ప, పెద్ద ఈరన్నకు చెందిన రెండు దగ్ధమయ్యాయి. గ్రామంలో రాఘప్ప, పెద్ద ఈరన్న అనే ఇద్దరు రైతులు పాడి పశువుల కోసం రెండు గడ్డివాములు వేసుకున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు గడ్డివాములు వద్ద సిగరేట్ వెలిగించుకుని నిప్పు పడేయడంతో మంటలు వ్యాపించాయి. స్థానికులు గమినించి రైతులకు, అగ్నిమాపక సిబ్బంది సమాచారం ఇవ్వడంతో గ్రామస్తులు, ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు.