అక్రమాలకు పాల్పడినందునే ఎమ్మిగనూరు కేజీబీవీ ప్రిన్సిపాల్ కవితపై విచారణ చేసిన అధికారులు విధుల నుంచి తొలగించారని, ఆమెకు మళ్లీ అక్కడే పోస్టింగ్ ఎందుకు ఇచ్చారని శనివారం ఐక్య విద్యార్థి సంఘాల నాయకులు మహేంద్ర బాబు ప్రశ్నించారు. ఎమ్మిగనూరులోని సోమప్ప సర్కిల్లో కళ్లకు గంతలు కట్టుకొని అధికారుల తీరుపై నిరసన వ్యక్తం చేశారు. విద్యార్థుల కడుపులు మాడ్చి వారి సొమ్మును కాజేసిన ప్రిన్సిపాల్ ను తొలగించాలన్నారు.