ఈపూరు: ఇద్దరు పిల్లలతో కాలువలో దూకిన వ్యక్తి
పల్నాడు జిల్లా, ఈపూరు మండలంలో గురువారం విషాదం చోటు చేసుకుంది. ఈపూరు మండలంలో విలేకరిగా విధులు నిర్వహిస్తున్న వ్యక్తి తన ఇద్దరు ఆడ పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకునేందుకు ఆరేపల్లి ముప్పాళ్ళ వద్ద సాగర్ కెనాల్ పెద్ద కాలువలో దూకాడు. ఇద్దరు పిల్లలు నీటిలో కొట్టుకుపోయారు. గమనించిన స్థానికులు అతడిని కాపాడి ఒడ్డుకు చేర్చారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.