ఆత్మకూరు పట్టణంలోని పలు కాలనీలలో చెత్తాచెదారాలు పేరుకుపోయి రోడ్ల నిండా చెత్తతో, డ్రైనేజీలలో చెత్త పేరుకుపోయి దుర్వాసన వెదజల్లుతూ డంపు యార్డులను తలపిస్తున్నాయని కావున పట్టణంలో డంపు యార్డు సమస్యను పరిష్కరించి ప్రజలను విష జ్వరాల నుంచి కాపాడాలని సిపిఎం పార్టీ పట్టణ కార్యదర్శి రణధీర్ అన్నారు. ఆదివారం సిపిఎం పార్టీ పట్టణ కమిటీ పట్టణంలోని పలు వీధులలో పేరుకుపోయిన చెత్త కుప్పలను పరిశీలించారు.