మహానంది పుణ్యక్షేత్రంలో వెలసిన శ్రీ కామేశ్వరి అమ్మవారికి భక్తులు 17. 5 గ్రాముల బంగారు కాసుల హారం భక్తితో విరాళంగా అందజేశారు. సోమవారంకర్నూలు జిల్లా పెద్దపాడు గ్రామ వాస్తవ్యులు చంద్రకళాధర్ రెడ్డి వారి కుమారుడు లోకేష్ రెడ్డి, మాధవి దంపతులు రూ. లక్ష 35వేలు విలువైన బంగారు కాసుల హారం ఆలయ ఈవో నల్ల కాల్వ శ్రీనివాసరెడ్డికి విరాళంగా అందజేశారు. దాతలను అభినందించి, స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.