మంత్రాలయం నియోజకవర్గంలోని ఉరుకుంద ఈరన్న స్వామి క్షేత్రంలో భక్తుల కోసం ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపడుతున్నట్లు డిప్యూటీ కమిషనర్ విజయరాజు తెలిపారు. సోమవారం ఉరుకుందలో ఆయన మాట్లాడారు. ప్రతి అమావాస్య రోజు లక్ష పుష్పార్చన కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో పాల్గొనే దంపతులు స్వయంగా లక్ష పుష్పాలు తీసుకొని పూజలో పాల్గొనాలని, దేవాలయానికి రూ. 11, 118 రుసుం చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు.