పెద్దకడబూరు మండలానికి 2024-25 రబీ సీజను గానూ 140 క్వింటాళ్ల వేరుశనగ రాయితీ విత్తనాలు మంజూరు అయినట్లు మండల వ్యవసాయ అధికారి వరప్రసాద్ శనివారం తెలిపారు. వేరుశనగ క్వింటం ధర రూ.9,600 కాగా రూ.3,840 సబ్సిడీ పోగా రైతు రూ.5,600లు చెల్లించి రైతు సేవా కేంద్రంలో పొందవచ్చని తెలిపారు. అలాగే రైతులు ఈ రబీ సీజన్ నుంచి పంటల బీమా ప్రీమియం చెల్లించాల్సి ఉంటుందని వెల్లడించారు.