కూటమి ప్రభుత్వం బేడ బుడగ జంగాలకి ఇచ్చిన హామీని నెరవేర్చాలని ఆంధ్రప్రదేశ్ బేడ బుడగ జంగం రాష్ట్ర అధ్యక్షుడు తూర్పాటి మనోహర్ డిమాండ్ చేశారు. ఆయన మంగళవారం కర్నూలులో మీడియాతో మాట్లాడుతూ.. ఎస్సీ రిజర్వేషన్ హక్కులు కల్పించడంలో ప్రాంతీయ వ్యత్యాసాలు చూపిస్తూ విద్య, ఉపాధి, సంక్షేమం లేక ఎన్నో ఏళ్లుగా నష్టపోతున్నామని అన్నారు.