కర్నూలు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శనివారం కలెక్టర్ రంజిత్ బాషను బేడ, బుడగ జంగం రాష్ట్ర అధ్యక్షులు తూర్పాటి మనోహర్ కలిసి తమ సమస్యలను విన్నవించుకున్నారు. తమ జాతి ఎదర్కొన్న సమస్యపై గతంలో సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీలో భాగంగా అల్పసంఖ్య, సంచార, దళిత, బేడ బుడగ జంగం కులానికి రాజ్యాంగపరమైన రిజర్వేషన్ హక్కులు కల్పించాలని కోరారు.