సీమ ప్రాజెక్టులను పూర్తి చేస్తాం: మంత్రి నిమ్మల
సీమ ప్రాజెక్టులను పూర్తి చేస్తామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ఆదివారం హంద్రీనీవా సుజల స్రవంతి ఎత్తిపోతల పథకం సందర్శనలో భాగంగా కర్నూలుకు చేరుకున్నారు. మంత్రి నిమ్మలను మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీ కలిసి జిల్లాలోని అసంపూర్తి, పెండింగ్ ప్రాజెక్టులకు నిధులు ఇచ్చి తక్షణం పనులు చేపట్టాలన్నారు. తుంగభద్ర నదిపై 20 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో గుండ్రేవుల జలాశయం నిర్మించాలని కోరారు.