ఉచితంగా డప్పు కొట్టాలని కళాకారులను బెదిరించిన కోడుమూరు నియోజకవర్గంలోధి కర్నూలు రూరల్ మండలం జి. సింగవరం సచివాలయ ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని ఏపీ డప్పు కళాకారుల సంఘం జిల్లా కార్యదర్శి బి. కరుణాకర్ డిమాండ్ చేశారు. గురువారం కర్నూలులో వారు మాట్లాడారు. డప్పు కొట్టకపోతే పెన్షన్లను తొలగిస్తామని బెదిరిండచం అన్యాయమన్నారు. దౌర్జన్యం, బెదిరింపులకు పాల్పడడం చేస్తే తగిన చర్యలు తీసుకోవాలన్నారు.