జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం తప్పకుండా అందజేస్తామని కర్నూలు జిల్లా జేసీ బి. నవ్య తెలిపారు. శుక్రవారం కర్నూలు మండల గార్గేయపురం సమీపంలో 340సి నేషనల్ హైవే నిర్మాణంలో కోల్పోయిన భూముల పత్రాలను నేషనల్ హైవే స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ చిరంజీవితో కలిసి జేసీ పరిశీలించి, మాట్లాడారు. భూములు కోల్పోయినటే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, న్యాయం చేస్తామని జేసీ హామీ ఇచ్చారు.