గూడూరు మండలంలోని రైతులంతా రెవెన్యూ సిబ్బందిని సంప్రదించి తమతమ భూ సమస్యలను పరిష్కరించుకోవాలని గూడూరు తహసీల్దార్ రామాంజినేయులు సూచించారు. శనివారం గూడూరు మండలంలోని గుడిపాడులో తహసీల్దార్ రామాంజినేయులు రీసర్వేలో నెలకొన్న భూసమస్యలపై గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా రైతుల నుంచి 23 ఫిర్యాదులను స్వీకరించనున్నట్లు తహసీల్దార్ తెలిపారు. కార్యక్రమంలో రీసర్వే సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.