మహా ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం పై మతోన్మాది నరసింహ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసిస్తూ శుక్రవారం ఆళ్లగడ్డ పట్టణ జేఏసీ నాయకుడు భాష ఆధ్వర్యంలో ముస్లిం సోదరులు అందరూ ఈద్గా మసీదు నుండి నాలుగు రోడ్ల కూడలి వరకు భారీర్యాలీ నిర్వహించారు. ఎంతోమంది ముస్లిం సోదరుల మనోభావాలను దెబ్బతీసిన నరసింహ పై తక్షణమే చర్యలు తీసుకొని అతనిపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని వారు డిమాండ్ చేశారు.డిఎస్పీకి వినతి పత్రాన్ని సమర్పించారు.