ఆళ్లగడ్డ పట్టణంలోని ఎంపీడీవో ఆఫీస్ లో శనివారం రోజున ఏర్పాటు చేసిన న్యాయ సేవ దినోత్సవం సందర్భంగా అయిదవ అదనపు జిల్లా జడ్జి ఆర్ వి విఎస్ మురళి కృష్ణ ఆదేశాల మేరకు ఆళ్లగడ్డ కోర్టు సీనియర్ సివిల్ జడ్జి శైలజ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరు క్రిమినల్ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని అప్పుడే ఎటువంటి తప్పులు చేయకుండా ప్రజల్లో మార్పు వస్తుందని తెలిపారు.