మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో సీఎం నారా చంద్రబాబు నాయుడుని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మర్యాదపూర్వకంగా సోమవారం కలిశారు. సీఎం ఆదేశాల మేరకు ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గలోని అన్ని మండలాలు ప్రతి ఒక ఇంటికి వెళ్లి వందరోజుల పరిపాలనలో భాగంగా మనం ఏమి అభివృద్ధి చేశాము అన్న విషయాలు ప్రజలకు తెలిపామన్నారు. మిగిలి ఉన్న అభివృద్ధి పనుల గురించి ప్రజలు నా దృష్టికి తీసుకురావడం జరిగిందన్నారు.