ఆళ్లగడ్డ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గొడిగనూరులో మంగళవారం కార్డెన్ అండ్ సెర్చ్ ఆపరేషన్, అవగాహన కార్యక్రమం ఆళ్లగడ్డ రూరల్ ఇన్స్పెక్టర్ హనుమంత నాయక్ నిర్వహించారు. కార్యక్రమంలో సరైన ధ్రువపత్రాలు లేని 11 మోటార్ సైకిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నరు. ఇన్స్పెక్టర్ గ్రామస్థులతో మాట్లాడుతూ ఎన్నికల నేపథ్యంలో ఎటువంటి అల్లర్లకు పాల్పడ రాదని నిబంధనలు పాటించని వారిపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు.