ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేసేందుకే కేంద్రం జాతీయ నూతన విద్యా విధానాన్ని బలవంతంగా అమలు చేస్తుందని ఏఐఎస్‌ఎఫ్ జాతీయ మాజీ ఉపాధ్యాక్షుడు గుజ్జల ఈశ్వరయ్య, రాష్ట్ర అధ్యక్షుడు జాన్సన్ బాబు ఆరోపించారు. మంగళవారం ఆదోనిలో ఏఐఎస్‌ఎఫ్ 30వ జిల్లా మహాసభలు ప్రారంభమయ్యాయి. వారు మాట్లాడారు. రాష్ట్ర బడ్జెట్‌లో విద్యాశాఖకు కేవలం 9శాతం నిధులు కేటాయించడం అన్యాయమన్నారు.