ఏమిగనూరులోని రోడ్ల సమస్యలపై మంత్రికి వినతిపత్రం
ఎమ్మిగనూరు శాసనసభ్యులు బి. జయ నాగేశ్వరరెడ్డి సోమవారం రాష్ట్ర రోడ్ల, భవన నిర్మాణ శాఖ మంత్రి బీసీ జనార్థన్ రెడ్డిని వారి ఛాంబర్లో మర్యాద పూర్వకంగా కలిసారు. అనంతరం మంత్రితో భేటీలో పాల్గొని నియోజకవర్గంలోని రోడ్లు, ఇతర సమస్యలపై మంత్రికి వినతిపత్రం అందించారు. ఎమ్మెల్యే విజ్ఞప్తికి మంత్రి సానుకూలంగా స్పందించి, త్వరితగతిన పరిష్కరిస్తానని హామీ ఇవ్వడం జరిగింది.