రీ సర్వేలో చేసుకొన్న తప్పులను సరి చేయాలని అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో సోమవారం ఎమ్మిగనూరులోని మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఎమ్మార్వో శేషఫణికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా నాయకులు ఎం సత్తన్న, ఎస్ బాలరాజు, హనుమంతు మాట్లాడుతూ రీ సర్వే జరిగిన గ్రామాల్లో తప్పులు తడకలుగా భూ సమస్యలు ఉన్నాయని గుర్తు చేశారు.