మహానంది: సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి
సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని మహానంది ఎస్ఐ ఎన్. రామ్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం మహానంది పోలీస్ స్టేషన్లో ఆటో డ్రైవర్లకు, యువకులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ఏదో ఒక లింక్ పంపించి ఆశ చూపడంతో అమాయక యువత వారి ఉచ్చులో పడి నిలువునా దోపిడీకి గురవుతున్నారన్నారు.