శ్రీశైలంలో అన్న ప్రసాద వితరణకు పచ్చళ్ళ విరాళం
శ్రీశైలం దేవస్థానం నిర్వహిస్తున్న అన్నప్రసాద వితరణకు ఇబ్రహీంపట్నం వాస్తవ్యులు ఎన్. సత్యనారాయణ, బెంగుళూరు వాస్తవ్యులు సుదర్శన్, పి. చైతన్యలు పచ్చళ్ళను విరాళంగా శనివారం అందజేశారు. 2 వేల కేజీల ఈ పచ్చళ్ళను అన్నప్రసాద వితరణలో భక్తులకు వడ్డించేందుకు దాతలు అందజేయడం జరిగింది. వీటిలో మామిడికాయ, నిమ్మకాయ పచ్చళ్ళు ఉన్నాయి. వీటి విలువ సుమారు రూ. 3 లక్షలదాకా ఉంటుందని దాతలు తెలియజేశారు.