కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం శాసన సభ్యురాలు కంగాటి శ్రీదేవికి అలాగే కర్నూలు నియోజకవర్గ శాసనసభ్యులు హఫీజ్ ఖాన్ కి వినతిపత్రం పూర్వకంగా బేడ బుడగ జంగాల సమస్యను అసెంబ్లీలో ప్రస్తావించాలని జీవో జారీ చేయాలని కోరారు. వీటికి వారు సానుకూలంగా స్పందించారు న్యాయం జరిగే విధంగా మా వంతు సహకారం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ బుడగ జంగం సంక్షేమ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు తూర్పాటి మనోహర్, కమిటీ సభ్యులు డీ.కే రంగస్వామి, ధూపం మాధవరావు, బలగొల్ల వీరభద్రయ్య, తాటికొండ రామాంజనేయులు దూపం చిన్న రాముడు, వెంకటేష్ పాల్గొన్నారు.