కర్ణాటక ప్రాంతానికి వెళ్లి పింఛన్ పంపిణీ చేసి సచివాలయ ఉద్యోగి మేరీ మంచి మనస్సును చాటుకుంటున్నారు. శుక్రవారం హలహర్వి మండలంలోని గూళ్యం గ్రామంలో పింఛనుదారుడు సిద్ధలింగప్ప రోడ్డు ప్రమాదంలో గాయపడి బళ్లారి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. విషయం తెలుసుకున్న అగ్రికల్చర్ అసిస్టెంట్ మేరి బళ్లారికి వెళ్లి సిద్ధలింగప్పకు పింఛన్ పంపిణీ చేశారు. మేరీని ఎంపీడీఓ వరలక్ష్మి, పంచాయతీ కార్యదర్శులు, గ్రామస్తులు అభినందించారు.