కర్నూలు: దివ్యాంగుల బాలల వసతి గృహం తనిఖీ

78பார்த்தது
కర్నూలు: దివ్యాంగుల బాలల వసతి గృహం తనిఖీ
కర్నూలు నగరం సి. క్యాంపులోని దివ్యాంగుల బాలల వసతి గృహాన్ని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకట శేషాద్రి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. గత వారంలో ఇద్దరు బాలలు కూరలో గుర్తు తెలియని మాత్రలు కలపడంతో కొంతమంది బాలలు అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటనపై విచారించేందుకు ఆయన వసతి గృహాన్ని తనిఖీ చేశారు. ఆయన వసతి గృహంలోని వంటశాలను, భోజన వసతుల గురించి బాలలను అడిగి తెలుసుకున్నారు.

தொடர்புடைய செய்தி