కోడుమూరు: బెల్ట్ షాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు: ఎస్సై

59பார்த்தது
కోడుమూరు: బెల్ట్ షాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు: ఎస్సై
అక్రమంగా మద్యం విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని కోడుమూరు ఎస్సై శ్రీనివాసులు బెల్ట్ షాపుల నిర్వాహకులకు మంగళవారం హెచ్చరికలు జారీ చేశారు. మండలంలోని గ్రామాల్లో అక్రమంగా మద్యం విక్రయించే వ్యక్తులను పోలీస్ స్టేషన్ కు పిలిపించి ఎస్సై కౌన్సిలింగ్ ఇచ్చారు. గ్రామాల్లో మద్యం మత్తులో ఎక్కువగా గొడవలు జరుగుతున్నాయని, బెల్ట్ షాపులే కారణమని తెలుస్తోందన్నారు. ఎవ్వరైనా బెల్ట్ షాపులు నిర్వహిస్తే, చర్యలు తప్పవన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி