కోడుమూరు మండలంలో గృహ నిర్మాణాలను త్వరగా పూర్తి చేసుకోవాలని ఎంపీడీవో రాముడు లబ్ధిదారులకు సూచించారు. శుక్రవారం మండలంలోని ఎర్రదొడ్డిలో ఎంపీడీవో పర్యటించి, గ్రామంలో గృహనిర్మాణ పథకం కింద నిర్మించుకుంటున్న ఇళ్లను పరిశీలించి, మాట్లాడారు. గ్రామంలో మొత్తం 30మంది లబ్ధిదారులకు ఇండ్లు మంజూరైతే 25మంది ఇండ్ల నిర్మాణాలను పూర్తి చేసుకున్నారని, మిగిలిన ఐదుగురు కూడా త్వరగా పూర్తి చేసుకోవాలన్నారు.