రీసర్వేలో నెలకొన్న భూసమస్యల పరిష్కారమే లక్ష్యంగా గ్రామ సభలు నిర్వహిస్తున్నామని, రైతులు సద్వినియోగం చేసుకోవాలని డిప్యూటీ కలెక్టర్ నాగప్రసన్నలక్ష్మి తెలిపారు. మంగళవారం గూడూరు మండలం మల్లాపురంలో తహసీల్దార్ రామాంజినేయులు ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రామసభలో ఆమె మాట్లాడారు. రైతులు తమ సమస్యలపై వినతులు అందజేసి పరిష్కరించుకోవాలని సూచించారు. సర్పంచు భాగ్యలక్ష్మి, రీసర్వే డీటీ లోకేశ్వరరెడ్డి, ఉన్నారు.