దీపం పథకం మహిళలకు ఓ వరమని కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి అన్నారు. శుక్రవారం దీపావళి కానుకగా గూడూరులో దీపం 2 ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని కోడుమూరు ఎమ్మెల్యే దస్తగిరి జెండా ఊపి ప్రారంభించారు. ఇళ్ల దగ్గరకే వెళ్ళి మహిళలకు గ్యాస్ సిలిండర్లను ఎమ్మెల్యే పంపిణీ చేసి మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుతామన్నారు. రామాంజనేయులు, గజేంద్ర గోపాల్ నాయుడు ఉన్నారు.