ఆళ్లగడ్డ: గ్రంథాలయ వారోత్సవాల ముగింపు సభలో పాల్గొన్న డిఎస్పి
ఆళ్లగడ్డ పట్టణంలో 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు కార్యక్రమం బుధవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఆళ్లగడ్డ డిఎస్పి రవికుమార్, ఎమ్మార్వో జ్యోతి రత్నకుమారి, ప్యానల్ అడ్వకేట్ షహనా,వైపీపీఎం హెడ్ మస్టర్ వీర రాఘవయ్య, ఎంఈఓ శోభ వివేకావతి హాజరయ్యారు.డిఎస్పి మాట్లాడుతూ గ్రంధాలయం చదువుల తల్లిలా ఉంటుంది, మీరు గుడ్ అండ్ బ్యాడ్ విషయాలు తెలుసుకొని, ఏవైనా ఇబ్బందులు ఉంటే స్కూల్లో లేదా ఇంట్లో తెలియజేయండి అన్నారు.