ఆళ్లగడ్డ మండలం మిట్టపల్లి గ్రామంలో దివ్యాంగుల ఆదరణ సేవా సమితి కమిటీ సభ్యులను ఆదివారం ఎన్నుకోవడం జరిగింది. ఈ సంఘంలో ప్రెసిడెంట్ గడ్డం లక్ష్మీదేవి, వైస్ ప్రెసిడెంట్ చంటి ఓబులేసు, సెక్రెటరీ చిన్న నారాయణ, గ్రామ నాయకులుగా ఎన్నుకోవడం జరిగింది. వారు మాట్లాడుతూ దివ్యాంగులకు రావాల్సిన 2016 చట్టాన్ని అమలు చేయాలన్నారు. దివ్యాంగులను ఆదుకొని వారికి రావాల్సిన హక్కులను వెంటనే నెరవేర్చాలని అన్నారు.