శనివారం ఆదోని మండలము సంతే కోడూరు గ్రామములో ఉపాధి పనులను సిపిఎం పార్టీ మండల కార్యదర్శి వెంకటేశ్వర్లు, మండల నాయకులు తిక్కప్ప పరిశీలించారు. దాదాపు ఎనిమిది వారాల నుండి అందరికీ వేతనాలు చెల్లించడం లేదని, అలాగే కొంతమందికి మూడు నెలల నుండి వేతనము అందడం లేదని కూలీలు చెప్పారు. కూలి వేతనము కూడా కొంత మందికి కేవలము ప్రతి రోజుకు 60 రూపాయలు మాత్రమే ఇస్తున్నారని అన్నారు. నెలల తరబడి కూలి వేతనాలు రాక, వచ్చిన వేతనము కూడా కేవలం అరవై రూపాయలు వస్తే మేము ఎలాగా బతకాలి అని చెప్పారు. సిపిఎం పార్టీ మండల కార్యదర్శి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధి పెండింగ్ వేతనాలు తక్షణమే చెల్లించాలని, కనీస వేతనం 300 రూపాయలు రోజుకు ఇవ్వాలని మరియు అదనపు పని దినాలు కూడా కల్పించాలని అన్నారు.