నందవరంలోని ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులు పీ.ఎం. శ్రీ పథకంలో సమగ్ర శిక్ష కార్యక్రమం కింద 7 రోజుల ప్రత్యక్ష శిక్షణ పొందుతున్నారు. విద్యార్థులు మీసేవ,సచివాలయాలు,ఎలక్ట్రానిక్స్ మరమ్మత్తు కేంద్రాల్లో అనుభవాన్ని సంపాదిస్తున్నారు.ఈ శిక్షణ ద్వారా వారు పరికరాల మరమ్మత్తు పద్ధతులు మరియు ఐటీ సాంకేతికతలపై అవగాహన పెంచుకుంటున్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఈ శిక్షణ భవిష్యత్ కెరీర్‌కు పునాది అవుతుందని అన్నారు.