హాళగుంద మండలం దేవరగట్టులో శ్రీ మాల మల్లేశ్వర స్వామి ఆలయంలో ఈనెల 7వ తేదీ నుంచి 16వ తేదీ వరకు ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు సోమవారం ఉదయం ఆలయ కమిటీ వారు తెలిపారు. శ్రీ మాల మల్లేశ్వర స్వామి ఉత్సవమూర్తులను నెరణీకి గ్రామం నుంచి తీసుకొని వెళ్లి దేవరగట్టులో పురోహితులచే గణపతి పూజ, స్వామివారికి కంకణధారణ, నిశ్చితార్థం, ధ్వజారోహణంతో బన్ని ఉత్సవాలు ప్రారంభమవుతాయని తెలిపారు.