కర్నూలు జిల్లాలోని ఆదోని డివిజన్ రీసర్వే అర్జీలను డిసెంబరు 31లోపు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా రెవెన్యూ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆదోనిలో డివిజనల్ స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించి, కలెక్టర్ మాట్లాడారు. డివిజన్లో 7,482 పిటిషన్లు ఉండగా, వీటిని ఎస్ఓపి ప్రకారం పరిష్కరించాలన్నారు. తహశీల్దార్లు స్వయంగా వెళ్లి మ్యుటేషన్ కేసులను పరిష్కరించాలని, భూసేకరణను వేగవంతం చేయాలన్నారు.