పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి నదుల అనుసంధానం చేస్తే రాష్ట్రంలో కరవు అనేది ఉండదు. కరవు నివారించి రైతులకు నీళ్లిస్తే బంగారం పండిస్తారు. ప్రతి ఎకరాకు నీరందించి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయవచ్చు. ఫ్లోరైడ్ నీళ్లతో బాధపడేవారికి ఉపశమనం కలుగుతుంది. నదుల అనుసంధానం నా జీవిత ఆశయం, కల అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అన్నారు. మంగళవారం లఘుచర్చలో భాగంగా సాగునీటి ప్రాజెక్టుల పరిస్థితిపై సీఎం సుదీర్ఘంగా మాట్లాడారు.