విజయవాడలోని రైల్వే స్టేషన్, అయోధ్య నగర్, మధురానగర్, సత్యనారాయణపురం, అజిత్ సింగ్ నగర్, పరిసరాల ప్రాంతంలో బుధవారం ఉదయం వర్షం దంచికొట్టింది. ఉన్నట్లుండి ఈదురు గాలితో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో ద్విచక్ర వాహనదారులు రోడ్లపై ఉన్న డ్రైనేజీలు, గుంతలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రజలు ఎవరు విద్యుత్ స్తంభాల కింద ఉండవద్దని, జాగ్రత్త వహించాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.