రాష్ట్ర ప్రభుత్వం ట్యూ ఆప్ చార్జిల పేరుతో ప్రజలపై రూ.17వేల కోట్ల బారం వేయడాన్ని నిరసిస్తూ సిపిఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర పిలుపులో భాగంగా విజయవాడ గాంధీనగర్ తహసీల్దార్ కార్యాలయం వద్ద శనివారం ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా ఉద్దేశించి న్యూడెమోక్రసీ నగర కార్యదర్శి ఎం. రామకృష్ణ మాట్లాడుతూ దేశంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు విపరీతంగా పెరగటంతో నిత్యావసర సరుకుల ధరలు ఆకాశానికి అంటాయి అని మండిపడ్డారు.