రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా జిల్లాలో అత్యంత పారదర్శకంగా దీపం-2 పథకం అమలుకు చర్యలు తీసుకున్నామని, లబ్ధిదారులు పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ నిధి మీనా, శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ తెలిపారు. శుక్రవారం విజయవాడలోని పటమటలో దీపావళి కానుకగా దీపం-2 పథకం ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది.