సినీ నటుడు పోసాని కృష్ణ మురళి పై విజయవాడ టీవీ5 బృందం సిపి రాజశేఖర్ బాబుకు ఫిర్యాదు చేశారు. గురువారం సాయంత్రం స్వయంగా సిపి ని కలిసి ఫిర్యాదును అందించారు. టిటిడి చైర్మన్ టీవీ5 అధినేత బిఆర్ నాయుడు పై పోసాని కృష్ణ మురళి చేసిన అనుచిత వ్యాఖ్యలపై అతడిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని సిపి రాజశేఖర్ బాబును కోరారు.